నా భర్త చనిపోయి ఏడాది కావస్తోంది. కిందటి నెలలో వితంతు పింఛన్‌కోసం దరఖాస్తు చేశా. అక్టోబరు ఒకటిన కొత్త పింఛన్లు వస్తాయన్నారు. ఎంతగానో ఎదురు చూశా. తెల్లారాక మునుపటిలా పాత వారికే పింఛన్లు ఇచ్చారు కాని కొత్తవారికి మొండిచెయ్యి చూపారు. నాకెలాంటి ఆస్తిపాస్తులులేవు. హోటల్‌లో పనిచేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నా. మా లాంటి నిస్సహాయులకు ఫించన్లు ఇవ్వడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడం విచారకరం. – గోరంట్ల రెడ్డెమ్మ, వితంతువు,
అంగళ్లు గ్రామం , కురబలకోట మండలం


