– గాయపడిన వృద్ధుడు
మదనపల్లె టౌన్ : ముఖ్యమంత్రి సభకు అభిమానంతో వచ్చిన ఓ వృద్ధుడు సభ ముగించుకుని వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని కథనం మేరకు వివరాలు.. సత్యసాయి జిల్లా కొక్కంటి గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ (65) శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వీవర్స్ కాలనీలో జరిగిన రాయలసీమ రైజింగ్ సభకు హాజరయ్యారు. సభ ముగిసిన తర్వాత వందలాది మంది ఒక్కసారిగా బయటకు వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. రద్దీలో నిలదొక్కుకోలేక వృద్ధుడు కిందపడిపోయాడు. జనం తొక్కేయడంతో కూడికాలు విరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నొప్పితో విలవిలలాడుతున్న ఆయనను గమనించిన పోలీసులు వెంటనే 108లో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


