సాక్షి, మదనపల్లె: గాంధీజీ ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి అని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.వెంకటేశు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత, సేవా మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టడం ద్వారా సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవలో ఉన్న అధికారులు, సిబ్బంది గాంధీజీ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ప్రేరణ’కు విద్యార్థి ఎంపిక
పుంగనూరు: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రేరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం మండలంలోని గూడూరుపల్లె పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి సతీష్ ఎంపికై నట్లు హెచ్‌ఎం మహేష్‌నారాయణ తెలిపారు. ఈ విద్యార్థిని ఉపాధ్యాయులు గుజరాత్‌కు తీసుకెళ్లి ప్రేరణ కలిగించనున్నట్లు తెలిపారు. కాగా ప్రేరణ కార్యక్రమం ద్వారా దేశంలో 20 మంది విద్యార్థులను ఎంపిక చేయగా అందులో పుంగనూరు ప్రాంత విద్యార్థి ఎంపియ్యాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సతీష్‌కు అభినందనలు తెలిపారు.
మైలవరం జలాశయం
సందర్శన
మైలవరం: మైలవరం జలాశయాన్ని సెప్టీ అధికారులు శుక్రవారం సందర్శించారు. ఈఈ చిన్న రంగప్పతో కలిసి సేప్టీ కమిటీ సభ్యులు జలాశయం గేట్ల వద్ద తనీఖీలను నిర్వహించారు. అలాగే మైలవరం రిజర్వాయర్ ఆనకట్టను గేట్లను, ప్రహారి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో రిటైర్డు సీనియర్ అధికారులు ఎంకె శ్రీనివాస్, ఎన్.వెంకటరమణ, పి.సుబ్బారావు, యు.రమేష్‌లు ఉన్నారు.ప్రస్తుత డ్యాం పరిస్థితిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఏఈలు సుబ్బారావు, హనుమాన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
4న సబ్–జూనియర్స్
కబడ్డీ ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: వైఎస్సార్‌జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4న 36వ జిల్లా సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు కడప మెయిన్ స్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గురు శేఖర్, కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బయ్య, వర్కింగ్ సెక్రటరీ టి. శ్రీవాణి తెలిపారు. బాలుర విభాగంలో గరిష్ట బరువు – 60 కిలోలు 2010 డిసెంబర్ 12 లోపు జన్మించి ఉండాలన్నారు. బాలికల విభాగంలో గరిష్ట బరువు – 55 కిలోలు 2010 డిసెంబర్ 29 లోపు జన్మించి ఉండాలన్నారు. వివరాలకు 9949304160, 9121497412 నంబర్లలో సంప్రదించాలన్నారు.
నియామకం
కడప అర్బన్: కడపలోని జిల్లాకోర్టులో 6వ ఏడీజే ఫ్యామిలీకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భరణికుమార్ నాయుడును నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ ఆయ్యాయి. ఈయన 1997 నుంచి కడపలోని జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులను నిర్వహిస్తున్నారు.


