పీనుగులవుతున్నా.. జీవచ్ఛవాలైనా.. అరిచి మొత్తుకున్నా స్పందించని ‘పీజీఆర్‌ఎస్‌’.. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికా? సామాన్యుడిని సతాయించే నరక కూపమా? జిల్లా కేంద్రం నుంచి మండల స్థాయి వరకు ఆర్భాటంగా సాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కాస్తా. | - | Sakshi
Sakshi News home page

పీనుగులవుతున్నా.. జీవచ్ఛవాలైనా.. అరిచి మొత్తుకున్నా స్పందించని ‘పీజీఆర్‌ఎస్‌’.. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికా? సామాన్యుడిని సతాయించే నరక కూపమా? జిల్లా కేంద్రం నుంచి మండల స్థాయి వరకు ఆర్భాటంగా సాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కాస్తా.

Sep 29 2026 12:21 AM | Updated on Sep 29 2026 12:21 AM

● వంచించి భూమి రాయించుకున్నారు

● పీజీఆర్‌ఎస్‌కు బాధితుల క్యూ ● సమస్య తీరక సతమతం ● సన్నగిల్లుతున్న నమ్మకం

దండం పెడుతున్నా...పింఛన్‌ ఇప్పించండయ్యా!

పళ్లు ఊడిపోయి బోసిపోయిన ఆ నోరు చెబుతోంది ఒంటిపైకొచ్చిన తన వద్ధాప్యాన్ని... ముడతలు పడ్డ చర్మం చెబుతోంది ఆమె దీనస్థితిని.. కాంతి లేని కళ్లు.. తెల్లగా మారిన కేశాలు తన దుస్థితికి సాక్ష్యమిస్తున్నాయి.... కళ్లు మూసుకున్న చంద్రబాబు సర్కారుకు ఇవేమీ కనిపించడం లేదు.. అధికారులకా అవేవీ పట్టడం లేదు.. ఈ వృద్ధురాలి పేరు ఎస్‌.నాగలక్షుమ్మ, ప్రొద్దుటూరు మండలం ఉప్పరపల్లె గ్రామం. పెన్షన్‌ తీసుకుంటున్న ఈమెకు రెండేళ్ల కిందట పెన్షన్‌ ఆగిపోయింది. అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు పెన్షన్‌ తొలగించారో అధికారులను అడిగింది.. సమాధానం లేదు. ఇటీవల కొత్త పెన్షన్లు వచ్చినపుడు మళ్లీ దరఖాస్తు చేసుకుంది. కానీ, ఆన్‌లైన్‌లో తమకు పెన్షన్‌ రాదని చూపుతోందని తేల్చి చెప్పారు. ‘అయ్యా వృద్ధురాలిని. వస్తున్న పెన్షన్‌ రాకుండా పోయింది. దండం పెడుతున్నా...పెన్షన్‌ ఇప్పించడయ్యా’ అంటూ అధికారులకు చేతులెత్తి వేడుకుంది.

భూమి భాగపరిష్కారం చేస్తామని వంచించి మదనపల్లి సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయంలో ఎకరా 27 సెంట్లు భూమిని రాయించుకుని మోసం చేశారని కురబలకోట మండలం కోనంగివారిపల్లికి చెందిన పెద్ద వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తనకు జరిగిన మోసంపై జేసీ శివ్‌ నారాయణ శర్మకు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత అన్నదమ్ముల మధ్య భూ భాగ పరిష్కారానికి సంబంధించి డమ్మీ దస్తావేజులు రాయించి చూపించారని తెలిపారు. ఇది నిజమని తాము మదనపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లి భాగ పరిష్కారం కోసం సంతకాలు చేసి వచ్చామన్నారు. అనంతరం దస్తావేజులు పరిశీలిస్తే తన భూమినంతటిని మదనపల్లి పట్టణం, ఎస్‌బీఐ కాలనీ, షిర్దిసాయి నగర్‌కు చెందిన వారు మోసపూరితంగా రాయించుకున్నట్లు తెలిసి వచ్చిందన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement