ఇతని పేరు తూట్ల గోపాలు. కురబలకోట మండలంలోని తుంగావారిపల్లి. సర్వేనెంబరు 89లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఇతనికి ఎకరా 70 సెంట్లు రావాలని చెబుతున్నాడు. సర్వే నిర్వహించి తన భాగం తేల్చాలని ఆరునెలలుగా పీజీఆర్‌ఎస్‌కు తిరుగుతున్నా సర్వేయర్ ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఇది ఇతరుల ఆక్రమణలో ఉంది. భాగపరిష్కారం కోసం ప్రతి వారం అర్జీ ఇస్తున్నా అధికారుల్లో చలనం లేదు. ఎన్నాళ్లు తిరగాలో..పరిష్కారం అవుతుందన్న నమ్మకం పోతోందని తూట్ల గోపాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.


