● చిరు వాచ్ షాప్ యజమాని కుమార్తెల
హాకీ రికార్డుల వేట
● హాకీలో రాణిస్తూ దేశానికి కీర్తి తేవడమే
ధ్యేయమంటున్న సోదరీమణులు
మదనపల్లె సిటీ: ‘ఆడపిల్లలు ఇంటికే పరిమితం కాదు.. మైదానంలోకి దిగితే దేశానికే గర్వకారణం్ఙ అని చాటిచెబుతున్నారు మదనపల్లెకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఒక చిన్న వాచ్ రిపేర్ షాపు నడుపుకుంటూ కష్టాల సుడిగుండంలో సాగుతున్న తండ్రి.. తన కష్టాన్ని పక్కనబెట్టి, కూతుళ్ల క్రీడా కలలకు రెక్కలు తొడిగాడు. తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ సోదరీమణులు హాకీ మైదానంలో ఆణిముత్యాలుగా రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు.
కష్టాలు ఎదురైనా.. క్రీడల్లోనే ప్రోత్సాహం
మదనపల్లె పట్టణం అప్పారావు వీధికి చెందిన సుల్తాన్ షరీఫ్, షాద్‌మానీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె షాహిరిదా పదో తరగతి చదువుతుండగా, రెండో కుమార్తె షాహి జోయ ఎనిమిదో తరగతి చదువుతోంది. తండ్రి సుల్తాన్ షరీఫ్ ఒక చిన్న వాచ్ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, కూతుళ్లకు క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి ఆయన వెనకడుగు వేయలేదు. ప్రతిరోజూ ఉదయాన్నే తన స్కూటర్‌పై పిల్లలిద్దరినీ బీటీ కాలేజీ హాకీ క్రీడా మైదానానికి తీసుకువెళుతూ, వారికి అన్ని వేళలా కొండంత అండగా నిలిచారు.
కోచ్‌ల మార్గదర్శకత్వం, తండ్రి ప్రోత్సాహంతో పెద్ద కుమార్తె షాహిరిదా జాతీయ స్థాయిలో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన హాకీ పోటీల్లో పాల్గొని అద్భు త ప్రతిభ కనబరిచింది. చిన్న కుమార్తె షాహిజోయ సైతం అక్క బాటలోనే నడుస్తూ.. జిల్లా స్థాయిలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన హాకీ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది.
దేశానికి పేరు తేవడమే మా ధ్యేయం
తమ విజయాల వెనుక తల్లిదండ్రుల శ్రమ ఉందని
ఆ సోదరీమణులు కృతజ్ఞతగా చెబుతున్నారు.


