వెబ్‌ డెవలెపర్‌కోర్సుపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

వెబ్‌ డెవలెపర్‌కోర్సుపై శిక్షణ

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

వెబ్‌ డెవలెపర్‌కోర్సుపై శిక్షణ నైపుణ్యం పోర్టల్‌ ద్వారా విద్య, ఉద్యోగావకాశాలు దోమకాటుతో ప్రాణాంతక వ్యాధులు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

రాయచోటి టౌన్‌ : నిరుద్యోగ యువతీ యువకులకు ఏపీఎస్‌ఎస్‌డీసీ వారి ఆధ్వర్యంలో వెబ్‌డెవలెపర్‌ కోర్పుపై శిక్షణ ఇవ్వనున్నట్లు రాయచోటి పాలిటెక్నికల్‌ ప్రిన్సిపల్‌ శివశంకర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులు సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంటర్‌ ఆపై కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 18–30 సంవత్సరాల లోపు వయస్సున్న వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 9550104260 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

జిల్లా వ్యాప్తంగా

పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్‌ ధరించకపోవడం, ట్రిపుల్‌ రైడింగ్‌, మైనర్లు వాహనాలు నడపడం, రాంగ్‌ రూట్‌ లో వెళ్లడం, అతివేగంగా వాహనాలు నడపడంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్‌న్స్‌, ఇన్సూరెన్‌న్స్‌, ఆర్సీ వంటి సరైన పత్రాలు లేని వాహన దారులను గుర్తించి జరిమానాలు విధించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, పటిష్టమైన రహదారి భద్రతను కల్పించడమే లక్ష్యంగా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ ను ప్రతిరోజూ కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాహన దారులు అందరూ విధిగా ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారి భద్రతలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

రాజంపేట టౌన్‌: నైపుణ్యం పోర్టల్‌ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు సులువుగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వైఎస్సార్‌ కడపజిల్లా ఉపాధికల్పనశాఖ అధికారి ఎస్‌.సురేష్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో నైపుణ్యం పోర్టల్‌పై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు తరగతిగదిలో నేర్చుకున్న నైపుణ్యాలను ప్రపంచానికి అందించడం ప్రారంభిస్తే ఆయా రంగాల్లో అనేక సేవలు అందిస్తారని, తద్వారా డబ్బులను కూడా సంపాదించుకోవచ్చన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ది అఽధికారి విజయ్‌వినీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యువత భయం వీడినప్పుడే ఏ రంగంలో అయినా రాణించగలరని తెలిపారు. ఇదిలావుంటే ఇటీవల ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా ఉపాధికల్పన అధికారి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌ సి.రామ్మూర్తి, న్యాక్‌ ఏడీ రాకేష్‌, ప్రభుత్వ ఐటిఐ సూపరిండెంట్‌ ఆదిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రాణి, ఏటీఓలు సుబ్బరాయుడు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

తొండూరు : దోమకాటువల్ల డెంగీ, మలేరియా, మెదడు వాపు వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని జిల్లా అసిస్టెంట్‌ మలేరియా అధికారి రామ విజయారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లా మల్లేల గ్రామంలో డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటా ఫీవర్‌, లార్వా సర్వేలు చేపట్టారు. నీటి నిల్వలను పరిశీలించి లార్వా నిర్మూలన కోసం యాంటీ లార్వాల ఆపరేషన్‌ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దోమ కాటుకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ సిద్ధయ్య, సీహెచ్‌ఓ సోమేశ్వరి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు సతీష్‌, అంజలి, జ్యోతి, సరళ, తదితరులు పాల్గొన్నారు.

పులివెందుల రూరల్‌ : తమను రెగ్యులర్‌ చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం వైఎస్సార్‌ కడ ప జిల్లా పులివెందులలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులకు హాజరై నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు శివప్రసాద్‌, సుజిత, వీణ, రుకియా, సుభాషిణి, శిరీషలు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పులివెందులలో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 100% గ్రేస్‌ ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement