కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజా సమస్యలు పూర్తిగా పక్కకు నెట్టి, ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం కడప నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి సీపీఐ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లదనం వెలికితీత, జన్‌ధన్ యోజన, ధరల స్థిరీకరణ నిధి , సమగ్రాభివృద్ధి వంటి వాగ్దానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిందని, 12 సంవత్సరాలైనా వాటిని అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్ వెంకట శివ, పి సుబ్బరాయుడు, ఎన్ విజయలక్ష్మి, కేసీ బాదుల్లా, ఎం వి సుబ్బారెడ్డి, పి చంద్రశేఖర్, శ్రీరాములు, బాలు, మస్తాన్, రవికుమార్, భాగ్యలక్ష్మి, మల్లికార్జున, నాగేశ్వరరావు, బుర్రి ఈశ్వరయ్య, లింగన్న, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


