సాక్షి, మదనపల్లె : నిన్నటిదాక పీకేఎం ఉడా పేరుతో కొనసాగిన పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం పేరు మారిపోయింది. మదనపల్లెలోని ఆ కార్యాలయంపై ఉన్న పీకేఎం ఉడా బోర్డును తొలగించారు. దానిస్థానంలో కొత్తగా అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేయగా, కొత్త చైర్మన్‌ను నియమించాల్సి ఉంది.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: కడప రిమ్స్ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ మైనారిటీ కళాశాలలో 2026–27,28 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఆర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కడప జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి పాస్, ఫెయిల్, ఇంటర్ పాస్, ఫెయిల్, ఆపై విద్యార్హతలు ఉన్న వారు కంప్యూటర్, మోకానిక్ మోటర్ వెహికల్, పిట్టర్, వెల్డర్ ట్రేడ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులు నేరుగా తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఫొటో, టీసీ తీసుకుని ఐటీఐ వద్దకు వచ్చి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తును రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తాము చేరదలచుకున్న ఐటీఐలను ఈ నెల 31 ఉదయం 10.30 గంటలకు హాజరై సీటు లభ్యతను బట్టి ఆడ్మిషన్ పొందవచ్చని జ్ఞానకుమార్ తెలిపారు.


