హెచ్‌ఐవీపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై అవగాహన పెంచుకోవాలి

Aug 29 2026 1:40 AM | Updated on Aug 29 2026 1:40 AM

కురబలకోట: హెచ్‌ఐవీ, సిఫిలిస్‌, హెపటైటీస్‌ –బీ వంటి వ్యాధులపై సరైన అవగాహన కలిగి ఉండాలని, అపోహలకు తావివ్వకుండా ముందస్తు పరీక్షలు, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని కడప, అన్నమయ్య జిల్లాల క్లస్టర్‌ మేనేజర్‌ వేంపల్లి భాస్కర్‌ అన్నారు. అంగళ్లులోని విశ్వం కళాశాలలో స్థానిక ఆర్‌ఆర్‌ఎస్‌ సంస్థ ఆధ్వర్వంలో శుక్రవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ వ్యాప్తి నియంత్రణపై విద్యార్థులకు అవగాహన అవసరమరని అన్నారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపట్ల వివక్ష సరికాదన్నారు.సిఫిలిస్‌తో పాటు ఇతర లైంగిక వ్యాధులను గుర్తిస్తే చికిత్స ద్వారా నియంత్రించవచ్చన్నారు. హెపటైటీస్‌–బి నుంచి రక్షణకు టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. యువత ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కన్నా ముందుగానే అవగాహనతో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమన్నారు.ప్రిన్సిపాల్‌ రఘునాథరెడ్డి, ఆర్‌ఆర్‌ఎస్‌ మేనేజర్‌ పురుషోత్తం, పల్లవి, సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement