అంకాలమ్మ చెరువుకు హద్దులు లేవు..! | - | Sakshi
Sakshi News home page

అంకాలమ్మ చెరువుకు హద్దులు లేవు..!

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

చెరువు విస్తీర్ణం తేల్చని అధికారులు

నోటీసు బోర్డు పెట్టి

చేతులు దులుపుకొన్న సిబ్బంది

కలకడ : కలకడ అంకాలమ్మ చెరువు ఆక్రమణలకు గురవుతోంది. అక్రమణను నుంచి కాపాడేందుకు అధికారులు చెరువు విస్తీర్ణాన్ని తేల్చాలని ప్రయత్నించారు. అయితే రోజుంతా శ్రమించిన రెవెన్యూ అధికారులు చెరువు హద్దులు తేల్చలేక చేతులెత్తేశారు. చెరువు ఆక్రమణను గురవుతోందని స్థానికులు రెవెన్యూ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంత ఆక్రమణకు గురైంది.. విస్తీర్ణం ఎంత ఉందో తేల్చాని మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. చెరువు ఆక్రమణపై 2018లో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. అప్పటి నుంచి ఎవరూ చెరువు ఆక్రమించలేదు. తిరిగి 2022లో మరికొందరు ఆక్రమణకు ప్రయత్నించగా.. అప్పటి కలెక్టర్‌ ఆదేశాలతో తహసీల్దార్‌ ఆక్రమణ దారులకు నోటీసులు ఇచ్చి చెరువును కాపాడారని మంగళవారం తహసీల్దార్‌ మహేశ్వరిబాయి దృష్టి తెచ్చారు. అంకాలమ్మ చెరువు సర్వే నంబర్‌ 436లో 27 ఎకరాల 0–63 సెంట్లు విస్తీర్ణంలో ఉందని ఎవ్వరూ ప్రవేశించరాదని నోటీస్‌ బోర్డు ఏర్పాటు చేశారే తప్పా.. మొత్తం అంకాలమ్మ చెరువు విస్తీర్ణం కొలచి హద్దులు మాత్రం చూపలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. చెరువు హద్దులు, కాలువలు చూపాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement