సాక్షి, మదనపల్లె : పదేళ్లు అనుభవంలో ఉన్నన ప్రభుత్వ అసైన్డ్ పట్టా ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మహాలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. శనివారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఓ నెంబర్ 297 ద్వారా గ్రామ కంఠం భూములకు, జీఓ నెంబర్ 306 ద్వారా పదేళ్ల అనుభవం ఉన్న అసైన్డ్ పట్టాలకు నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. స్టాంపుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నాసిక్ నుంచి స్టాంప్స్ రావాల్సి ఉందని, అవసరమైన మేర స్టాక్‌ను తెప్పించుకోవడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఓటీపీ విధానంతో ప్రజలకు పారదర్శక సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి ఇక్కడి రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలను ఆమెకు తెలియజేశారు.
డీఐజీ మహాలక్ష్మి పట్నాయక్


