మదనపల్లె టౌన్: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి, సామాన్య ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కఠిన నిర్ణయలు తీసుకుంటోందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రవాణా, ఆర్‌అండ్ బి, జాతీయ రహదారుల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు 4, 6,8,10, 20 చక్రాల వాహనాలతో పాటు ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు తప్పనిసరిగా రేడియం రిఫ్లెక్టర్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధ రించేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో ‘హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదు (నో హెల్మెట్–నో ఎంట్రీ) అనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి డి. అశోక్ ప్రతాప్, జిల్లా డీఆర్‌బీఈఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అరవింద దేవి, జాతీయ రహదారుల డీఈఈలు మధుసూదన, సుజాత (చిత్తూరు), నాగరాజ (రాయచోటి), మోటార్ వెహికిల్ ఇన్‌న్‌స్పెక్టర్లు దినేశ్ చంద్ర, అజయ్ కుమార్, డీసీఆర్బీ సీఐ ఏ.ఆదినారాయణ రెడ్డి, డీటీఆర్బీ ఎస్‌ఐ డి. రమేష్ బాబు తదితరలు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


