కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..! | - | Sakshi
Sakshi News home page

కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..!

Feb 23 2026 7:08 AM | Updated on Feb 23 2026 7:08 AM

కొత్త

కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..!

రాజంపేట : ఆంధ్రప్రదేశ్‌కు సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌(ఎస్‌ఈవోఆర్‌) ఆవిర్భవించిన నేపథ్యంలో.. విశాఖ జోన్‌లో ఏకై క రామాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం కావడం విశేషం. విశాఖ జోన్‌కు ప్రధాన పుణ్యక్షేత్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రామాలయం ఒంటిమిట్టనే. మార్చి 26 నుంచి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమవుతోంది. ఇటువంటి నేపథ్యంలో విశాఖ జోన్‌ రైళ్ల హాల్టింగ్‌, స్టేషన్‌ అభివృద్ధిపై ప్రణాళికలతో ముందడుగు వేయాలని ఆధ్యాత్మిక వేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

భద్రాచలం వైపే దక్షిణ మధ్య రైల్వే మొగ్గు

దక్షిణ మధ్య రైల్వేలో భద్రాచలం రైల్వేస్టేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉమ్మడి రాష్ట్ర విభజనతో సౌత్‌ ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ ఏర్పాటు అయింది. సౌత్‌ కోస్ట్‌ జోన్‌ జనరల్‌ మేనేజరు ఒంటిమిట్టి రైల్వేస్టేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

కూటమి ఎంపీలు కూడా..

ఒంటిమిట కోదండ రామాలయానికి భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ఒంటిమిట్టకు రైల్వేసౌకర్యం లేదన్న విషయాన్ని కూటమికి చెందిన 20 మంది ఎంపీలు గుర్తించాలని భక్తులు కోరుతున్నారు. కడప జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్‌ రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. అటువంటప్పుడు రాష్ట్రానికి ఏకై క అధికారిక రామాలయానికి వచ్చేందుకు రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హిందువాదులు పేర్కొంటున్నారు.

ఒంటిమిట్టను ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ గుర్తించాలి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను గుర్తించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ గుర్తించాలి. ముంబయి–చైన్నె కారిడార్‌ రైలుమార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్‌ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు.

పేరుకే ఒంటిమిట్ట స్టేషన్‌

దూరప్రాంత భక్తులు రైలుమార్గం ద్వారా వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్ట రామయ్య దర్శనానికి వస్తున్నారు. ఒంటిమిట్ట స్టేషన్‌ పేరుకు మాత్రమే ఉంది. నవ్యాంధ్ర ఏర్పడి నుంచి ఒంటిమిట్ట స్టేషన్‌ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి.

నిర్మాణానికి నోచుకోని ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నప్పుడు ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో డబుల్‌ ఫ్లాట్‌ఫాంలు ఉన్నాయి. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుకు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని రైల్వేబోర్డు మంజూరు చేసింది. గుంతకల్‌ డివిజన్‌లో మూడు చోట్ల మంజూరు చేస్తే, అందులో ఒంటిమిట్ట ఒకటి కావడం గమనార్హం. సెకండ్‌ ప్లాట్‌ ఫాంకు వెళ్లాలన్న, ఆవైపు పల్లెలోకి వెళ్లాలన్న ఎఫ్‌ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్లాట్‌ఫాం మధ్య రైలుపట్టాల మీదుగా ప్రయాణికులు రాకపోకలు సాగించాలి. ఈ పరిస్థితుల్లో ప్రమాదాల బారిన పడే పరిస్థితులున్నాయి. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించలేదు.

ఒంటిమిట్టలో రైళ్లకు హాల్టింగ్‌ ఇచ్చేనా

భద్రచాలం తరహాలో అభివృద్ధి జరిగేనా ..

వచ్చే నెల 26 నుంచి కోదండరాముని బ్రహ్మోత్సవాలు

రైల్వేమంత్రి అశ్విని వైష్ణవికి

ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ

ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేయాలి

ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు ఇప్పటికే ఒంటిమిట్ట స్టేషన్‌ అభివృద్ధి అంశాన్ని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేలా రైలు సౌకర్యం కల్పించాలి. కొత్తజోన్‌కు ఏకై క రామాలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. కావున అభివృద్ధి చేయాలి.

– మేడా మధుసూదన్‌రెడ్డి, నందలూరు

కొత్తజోన్‌ జీఎం అయినా కరుణించాలి

తెలంగాణలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేసి, రైలు సౌకర్యం కల్పించినప్పుడు.. నవ్యాంధ్రలో ఉన్న ఒంటిమిట్టపై దక్షిణ మధ్య రైల్వే నిర్లక్ష్యం చేసింది. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పడిన ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ అయినా భక్తులు ఒంటిమిట్టకు చేరుకునేందుకు రైలు సౌకర్యం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది.

–పసుపులేటి శంకర్‌, అధ్యక్షుడు, పోతన సాహిత్య పీఠం, ఒంటిమిట్ట

కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..!1
1/3

కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..!

కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..!2
2/3

కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..!

కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..!3
3/3

కొత్త జోన్‌లోనైనా.. ప్రగతి పట్టాలెక్కేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement