నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూపు
రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువత.. చంద్రబాబు నెల నెలా ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి రూ.3 వేల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం యువతను మోసం చేయడమే. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నమ్మి ఓటేసిన నిరుద్యోగుల ఆకాంక్షలను సీఎం చంద్రబాబు నెరవేర్చాలి.
– రాంపల్లి రమేష్, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి,
మంచూరు, వాల్మీకిపురం
నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూపు


