అక్రమార్కుల నుంచి మా భూములు కాపాడండి
లక్కిరెడ్డిపల్లి : అక్రమార్కులు మా తెలియకుండానే మా భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని బాధిత రైతులు వాపోయారు. తమ భూములను కాపాడాలని మండలంలోని గద్దగుండ్లరాచపల్లికి చెందిన బాధిత రైతులు కొండూరు రఘునాథరాజు, ఎనపడ్డ వెంకటసుబ్బన్న, వెంకటరామరాజు, షేక్ జబ్బర్ సాహెబ్, షేక్ దర్బార్ భాష, షేక్ తాజ్ భాష, షేక్ ఉమర్ భాషలు సోమవారం తహసీల్దార్ క్రాంతి కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గద్దగుండ్ల రాచపల్లి పొలంలో సర్వే నెంబరు. 625లో 7.18 ఎకరాలతో పాటు సర్వే నెంబరులోని 626లో 6.24 ఎకరాలు, సర్వే నెంబరు 614లో 19.68 ఎకరాల భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆన్‌లైన్ చేసుకున్నారన్నారు. వారి నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం వారు ఎస్‌ఐ డి శోభ, సీఐలకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
తహసీల్దార్‌కు బాధిత రైతుల వినతి


