కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి
కడప కార్పొరేషన్ : కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డివిజన్ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష అన్నారు. సోమవారం సాయంత్రం మాజీ డిప్యూటీ సీఎం కార్యాలంలో నార్త్‌జోన్, వెస్ట్‌జోన్‌ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జులు, పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు ఎంత ఉత్సాహంగా నిర్వహించామో ఇది కూడా అలాగే నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే అందరికీ గుర్తింపు కార్డులు, బీమా కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కేంద్ర కార్యాలయ రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి మాట్లాడుతూ ఇంటర్‌నెట్ సక్రమంగా ఉన్నచోటు నుంచి డిజిటలైజేషన్ చేయాలని, పదిమందిని నియమించుకొని సాధ్యమైనంతవరకూ కంప్యూటర్ల ద్వారా అ పనిని పూర్తి చేయాలన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాకా సురేష్ కుమార్, నార్త్‌జోన్ అధ్యక్షుడు బీహెచ్ ఇలియాస్, వెస్ట్ జోన్ అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ జమాల్‌వలీ, షఫీ, జమీల్ పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష


