పెట్టుబడి నష్టం
ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు నష్టాలు కలిగించాయి. ఐదెకరాల పొలంలో వేరుశనగ పంటను సాగు చేస్తే పెట్టుబడి దక్కలేదు. కుటుంబంతో కలిసి చేసిన కష్టానికి తోడు రూ.50వేల పెట్టుబడి పెడితే రూ.15వేలు దక్కింది. జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం కింద సాయం అందిస్తుందని ఆశించినా ఇప్పటిదాక ఎలాంటి సహాయం అందలేదు.
– బయ్యారెడ్డి, గుగ్గిళ్లపల్లె రైతు, పెద్దతిప్పసముద్రం
గత ప్రభుత్వంలో లీటర్ పాలకు రూ.45 ధర ఇచ్చేవారు. అందులోనే రూ.4 ప్రోత్సాహక రాయితీ అందేది. ప్రస్తుత పరిస్థితుల మేరకు పాలధర పెరగాల్సి ఉన్నా పెరగలేదు. ఇప్పుడు లీటర్‌కు రూ.35–40 ఇస్తున్నారు. నాలుగు పాడిఆవులతో రోజుకు 40 లీటర్ల పాలును పోస్తున్నాను. గత ప్రభుత్వంలో 15 రోజులకోసారి రూ.18వేల దాక పాలబిల్లు వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. ఆర్థికంగా ఆదాయం పెరగడం లేదు.
– గంగాధర, దిగువపల్లె పాడిరైతు, నిమ్మనపల్లె
2024లో మూడెకరాలు, 2025లో ఐదెకరాల్లో ఖరీఫ్ పంటగా వేరుశనగను సాగు చేస్తే వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. రెండు ఖరీఫ్‌లలో సాగుచేసిన పంటలకు దిగుబడులు దక్కక పూర్తిగా నష్టం వాటిల్లింది. రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడితే కష్టానికి ఫలితంలేదు, పెట్టుబడి దక్కలేదు. ప్రభుత్వం పరిహారం ఇస్తుందని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. ఇప్పటికై నా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– చిన్న నారాయణ,
మర్రిమాకులపల్లె రైతు, తంబళ్లపల్లె
పెట్టుబడి నష్టం
పెట్టుబడి నష్టం


