కూటమి కుట్రల్ని తిప్పి కొడదాం | - | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రల్ని తిప్పి కొడదాం

Jan 13 2026 6:13 AM | Updated on Jan 13 2026 6:13 AM

కూటమి

కూటమి కుట్రల్ని తిప్పి కొడదాం

వాల్మీకిపురం : క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ కూటమి కుట్రల్ని తిప్పికొట్టి జగనన్నను మరోసారి సీఎంను చేసుకుందామని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర గ్రామ కమిటీల పరిశీలకులు వజ్ర భాస్కర్‌ రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక షిరిడిసాయి కళ్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందన్నారు. అధికారంలోకి రావడం కోసం కూటమి ప్రభుత్వం అనేక మాటలు చెప్పి, ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత హామీలను విస్మరించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని గుర్తించి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలల్లో పదవులను అందించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని బలోపేతం చేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి సత్తా చాటుదామన్నారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ పార్టీలో అంతర్భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. మహిళా, యువజన, కార్మిక, విద్యార్థి, తదితర అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలు, నాయకులకు ఈ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమన్వయంతో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కమిటీల నిర్మాణం ఉండాలన్నారు. అనంతరం పార్టీ కమిటీల ఏర్పాటు, సభ్యత్వం, డిజిటలైజేషన్‌, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేసానికి ముందు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఇక్బాల్‌ అహ్మద్‌, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, ఆఘామొహిద్దిన్‌, రత్నశేఖర్‌ రెడ్డి, మహిత, శివానంద రెడ్డి, వెంకట్రమణారెడ్డి, అప్పల్లా, నీళ్ల భాస్కర్‌, రమేష్‌ రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి, కమలాకర్‌ రెడ్డి, చక్రధర్‌, కేశవ రెడ్డి, ఆనంద, శ్రీధర్‌రాయల్‌, నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అక్రమ కేసులకు భయపడొద్దు

మన బలగం పెరగాలి. కష్టకాలంలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుందని జగనన్న భరోసా ఇచ్చారు. కమిటీలో సభ్యత్వం తీసుకొని డిజిటలైజేషన్‌ చేయించుకుంటే అమరావతిలోని మన పార్టీ కార్యాలయంలో బటన్‌ నొక్కినా వివరాలు కనిపిస్తాయి. వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని రాష్ట్ర గ్రామ కమిటీల పరిశీలకులు వజ్ర భాస్కర్‌ రెడ్డి తెలిపారు.

వైఫల్యాలను ఎండగడదాం

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కమిటీల ద్వారా టిడిపి కుట్రలను తిప్పికొడదామని పార్టీ పరిశీలకులు సుబ్బారెడ్డి అన్నారు. గ్రామ స్థాయి నుంచి ఐకమత్యంగా ఉంటూ, కమిటీల్లో చోటు సంపాధించిన వారందరూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్ద ఎండగట్టి వైఎస్సార్‌సీపీ బలోపేతానికి బాటలు వేయాన్నారు.

క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం

గ్రామ కమిటీలే పార్టీకి పునాదులు

జగనన్నని మళ్లీ సీఎంను చేసుకుందాం

అక్రమ కేసులకు భయపడొద్దు

నియోజకవర్గ విస్తృత స్థాయి

సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల

కూటమి కుట్రల్ని తిప్పి కొడదాం1
1/1

కూటమి కుట్రల్ని తిప్పి కొడదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement