కోడిపందేల నిర్వహణ నేరం
–జిల్లా జేసీ, ఎస్పీ
మదనపల్లె : కోడిపందేల నిర్వహణ నేరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. సోమవారం జెసీ, ఎస్పీ, సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి కోడిపందేలు నిషేధం, శిక్షార్హం అన్న పోస్టర్లను మదనపల్లెలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జేసీ మాట్లాడుతూ ప్రజలు కోడిపందేలు, జూదం తదితర నిషేధిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడం, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కోడి పందేలను నిర్వహించినా, ప్రోత్సహించినా, బెట్టింగ్‌లకు పాల్బడినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్టాఫ్‌నర్స్‌గా పదోన్నతులు
కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం ఏఎన్‌ఎం నుంచి స్టాఫ్ నర్స్ గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–4 రాయలసీమ జిల్లాల పరిధిలో మొత్తం నలుగురికి ప్రమోషన్ లు కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగుల సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. కార్య క్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు.
23న వాక్–ఇన్ ఇంటర్వ్యూ
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం కళాశాల జంతు శాస్త్ర శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెస్సీ జంతు శాస్త్రంలో నెట్/ సెట్/ పీహెచ్‌డీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థుల బయో–డేటా, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు.. వారి జిరాక్స్ కాపీల సెట్‌తో నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలని సూచించారు.
జిల్లా జేసీగా
శివనారాయణ శర్మ
మదనపల్లె రూరల్ : అన్నమయ్య జేసీగా శివనారాయణ శర్మను నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. సోమవారం రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేస్తున్న ఆదర్శ రాజేంద్రన్‌ను చిత్తూరుజిల్లాకు, ఆయన స్థానంలో అనంతపురం జిల్లా జేసీగా పనిచేస్తున్న శివనారాయణ శర్మను నియమించారు. 2021 ఆంధ్రప్రదేశ్, ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శివనారా యణశర్మ, ఉత్తరప్రదేశ్ మధురలోని రాయకు చెందినవారు.
కోడిపందేల నిర్వహణ నేరం


