భవిష్యత్తుతో ఆటలు
విద్యాశాఖ వింత నిర్ణయం
మదనపల్లె సిటీ: విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో విద్యార్థులను ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సన్నద్ధం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కీలకమైన నెలలుగా భావిస్తారు. ఇలాంటి తరుణంలో టీచర్లకు క్రీడా పోటీలు అంత ముఖ్యమా అని విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యావేత్తలు, విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని కేడర్‌ల టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఈనెల 16వతేదీన జిల్లా అఽధికారులకు ఉత్తర్వులు పంపారు. ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు, మహిళా టీచర్లకు త్రోబాల్‌లో పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో ఈనెల 29,30, డివిజన్ స్థాయిలో డిసెంబర్ 13,14 తేదీల్లో, జిల్లా స్థాయిలో డిసెంబర్ 20,21,22 తేదీల్లో, రాష్ట్ర స్థాయిలో జనవరి 2,3,4 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రెమరీ స్కూలు 1,711, ప్రాథమికోన్నత పాఠశాలలు 162, ఉన్నత పాఠశాలలు 304 ఉన్నాయి. ఇందులో సుమారు 7 వేల మంది వరకు ఉపాద్యాయులు పని చేస్తున్నారు.
పేద విద్యార్థులకు అన్యాయం
నష్టపోయేది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే కదా. తమకేముంది అనే ధోరణిలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడిందేమి లేదు. కనీసం విద్యార్థుల నైపుణ్యాలైనా మెరుగుపడతాయని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని చంద్రబాబు సర్కారు నీరుగారుస్తోంది. పబ్లిసిటీ కోసం టీచర్లకు క్రీడా పోటీలను నిర్వహిస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పదో తరగతి విద్యార్థులకు కీలకమైన పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహించడమేమిటని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
నిధుల దుర్వినియోగానికేనా?
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో పని చేస్తున్న టీచర్లలో 90 శాతం మంది టీచర్లకు క్రీడల పట్ల ఆసక్తి లేదని తెలుస్తోంది. ప్రశాంతంగా విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటున్నామని, ఈ సమయంలో క్రీడాపోటీలు ఏమిటని కొందరు టీచర్లు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహించి వాటికి వెచ్చించే నిధులను దుర్వినియోగం చేసేందుకేనని విద్యావేత్తలు చెబుతున్నారు. జిల్లాలో మండల స్థాయి,డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి పోటీలకు నిధులు సమగ్రశిక్షశాఖ ద్వారా ఖర్చు చేయాలని ఆదేశించారు. పోటీలు పెట్టకపోయినా దొంగ బిల్లులు పెట్టి నిధులు నొక్కేసేందుకు తప్ప ఈ క్రీడలు ఎందుకు ఉపయోగపడవని పలువురు విమర్శిస్తున్నారు.
కీలక సమయంలో టీచర్లకు క్రీడాపోటీలు
రాష్ట్ర విద్యాశాఖ వింత నిర్ణయం
పది పరీక్షలపై దృష్టి పెట్టే సమయంలో క్రీడలు అవసరమా?
మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
కీలక సమయంలో క్రీడలు అవసరమా?
పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఎంతో కీలకం. విద్యార్థి దశలో పదో తరగతి ముఖ్యమైనది. ఇలాంటి దశలో విద్యార్థులలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. డిసెంబర్, జనవరి నెలలు క్రీడలకు సమయం వెచ్చిస్తే పేద విద్యార్థులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది. ఇలాంటి క్రీడా పోటీలు విద్యా సంవత్సరం మొదటలోల నిర్వహిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలి.
–నరసింహ, ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు
రాష్ట్ర విద్యాశాఖ వింత పోకడలను అమలు చేస్తోందని వి ద్యావేత్తలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల ప్రా రంభ సమయంలో క్రీడా పోటీలు నిర్వహిస్తే ఎవరికి ఎ టువంటి ఇబ్బంది ఉండదని విద్యావేత్తలు చెబుతున్నా రు. పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో క్రీడాపోటీల షెడ్యూలు జారీ చేయడం విడ్డూరంగా ఉంద ని మండిపడుతు న్నారు. విద్యాశాఖ విడుదల చేసిన షె డ్యూలు ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 4వతేదీ వర కు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల వల్ల వి ద్యార్థులు పూర్తిగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
భవిష్యత్తుతో ఆటలు
భవిష్యత్తుతో ఆటలు


