రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
మదనపల్లె సిటీ : 69వ ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్–14 బాల,బాలికల బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. సోమవారం మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, రాష్ట్ర అబ్జర్వర్ వర్మ ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథుడు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ పోటీలు 24వతేదీ వరకు జరుగుతాయని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. మెట్టమొదటిసారిగా ప్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ చిత్తూరు కార్యదర్శి డాక్టర్ బాబు, ఝాన్సీరాణి, పీడీలు అన్సర్, భద్రయ్య, రమేష్, శివశంకర్, నరేష్, భారతి, లత, వరలక్ష్మి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


