సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్‌తోపాటు రాయచోటి అర్జీఓ శ్రీనివాస్, జీఎస్‌డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి, సర్వే ఏడీ భరత్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, నియోజకవర్గ, మండలస్థాయి ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలు, గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు వివిధ రకాల అర్జీలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పథకాలు అమలు చేయాలి
అభివృద్ధి పథకాలను త్వరితగతిన నాణ్యతతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుంచి మదనపల్లె, రాజంపేట సబ్ కలెక్టర్లు, రాయచోటి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో కలెక్టర్ వీడియో కాన్ఫిరెన్సు నిర్వహించారు. సమావేశంలో వివిధ ప్రాధాన్యత ప్రాజెక్టులకు భూసేకరణ కేటాయింపు, పీజీఆర్‌ఎస్ పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. పథకాల అమలుకు సంబంధించి జ్లిలా, మండలస్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


