● వైఎస్సార్‌సీపీ హయాంలో నేరుగా ఇంటికి సరుకులు
2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవీ బాధ్య తలు చేపట్టిన తర్వాత రేషన్ కష్టాలకు తెర పడింది. నేరుగా ఎండీయూ వాహనాలు..ఆపరేటర్లు, సూపర్‌వైజర్ల ద్వారా నేరుగా కార్డుదారుల ఇంటికే సరుకులు అందించారు. ఎక్కడికక్కడ వాహనాలు ఒక ప్రత్యేక సైరన్ మోగగానే...రేషన్ బండి వచ్చిందని నేరుగా ఇంటివద్దనే సరుకులు తీసుకునేవారు. జిల్లాలో 350కి పైగా ఉన్న ఎండీయూ వాహనాలు ప్రస్తుతం మూలకు చేరాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఆపరేటర్లు, సూపర్‌వైజర్ల ఉపాధిపై దెబ్బపడగా, ప్రజలకు రేషన్ ఇబ్బందులు తప్పడం లేదు. ఏది ఏమైనా వైఎస్సార్‌సీపీ హయాంలో ఎలాంటి కష్టాలు లేకుండా సరుకులు అందేవని, ప్రస్తుతం డీలర్ల వద్దకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి తీసుకోవడం పెద్ద సమస్యగా మారిందని పలువురు వాపోతున్నారు.
ఇంటి వద్దకే రేషన్ బాగుండేది
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన ఇంటి వద్దకే రేషన్ విధానం మాలాంటి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఎవరూ ఇబ్బంది పడా ్డల్సిన పరిస్థితి ఉండేది కాదు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయడంవల్ల సమస్యలు ఎదురవుతాయి. కార్డుదారులు ఎక్కువ మంది వచ్చినప్పుడు గంటల కొద్ది వేచి ఉండాలి. వృద్ధులు, మహిళలు సరుకులు మోసుకెళ్లాలంటే అవస్థలు పడాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎఫ్‌పీ షాపులను పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల మాలాంటి కార్డుదారులకు మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. –ప్రమీలదేవి,
సి.ఎం కొత్తపల్లె, సంబేపల్లె మండలం
● వైఎస్సార్‌సీపీ హయాంలో నేరుగా ఇంటికి సరుకులు


