ఏపీలో 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. అన్నీ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే..! | YSRCP Wins 11 MLCs Unanimously In AP Council Elections | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల కోటాలో ఎన్నిక.. 11 స్థానాలనూ  దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ

Nov 27 2021 3:43 AM | Updated on Nov 27 2021 6:58 PM

YSRCP Wins 11 MLCs Unanimously In AP Council Elections - Sakshi

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 11 స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. పోటీ లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను రిటర్నింగ్‌ అధికారులు లాంఛనంగా జారీ చేయనున్నారు. దీంతో 58 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం 20 నుంచి 31కు పెరగనుంది. 

స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వీరే..

జిల్లా                      ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ
విజయనగరం              ఇందుకూరు రఘురాజు
విశాఖపట్నం             వరుదు కళ్యాణి, వంశీకృష్ణ యాదవ్‌
తూర్పుగోదావరి         అనంత ఉదయభాస్కర్‌
కృష్ణా                         తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్‌
గుంటూరు                ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు
ప్రకాశం                     తూమాటి మాధవరావు
చిత్తూరు                    కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌
అనంతపురం            వై.శివరామిరెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement