విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వార్తా ఛానళ్లు, ప్రతిపక్ష స్వరాలు, డిజిటల్ మీడియా ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
ప్రభుత్వంపై విమర్శలు చేసే మీడియా సంస్థల ఖాతాలను పరిమితం చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడి అని పేర్కొంది. ఆరోపణల్లో నిజం లేదంటే వాస్తవాలతో సమాధానం చెప్పాలని, అవసరమైతే నిష్పక్షపాత విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. ఖాతాలను బ్లాక్ చేయడం ద్వారా ప్రశ్నలను, అసమ్మతిని అణచివేయలేరని.. డీఎస్సీ నియామకాలపై ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిందేనని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది.


