‘ప్రభంజన’పేట  | Sakshi
Sakshi News home page

‘ప్రభంజన’పేట 

Published Mon, Jan 22 2024 4:54 AM

YSRCP Samajika Sadhikara Bus Yatra in Tirupati - Sakshi

సాక్షి తిరుపతి: నాయుడుపేట జనసంద్రమైంది. సూళ్లూరుపేట నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో పట్టణం కిక్కిరిసిపోయింది. సామాజిక సాధికార యాత్రకు జన నీరాజనం లభించింది. వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రభంజనంలా సాగింది.

స్థానికులతో పాటు ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్‌ బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు  పట్టణంలో తొలుత పాదయాత్ర జరిగింది. బైక్‌ ర్యాలీతో పాటు సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమై    ంది. అనంతరం అంబేడ్కర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు. అంతకు ముందు డాక్టర్‌ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ కాంగ్రెస్‌తో షర్మిల ప్రయాణాన్ని తప్పు పట్టారు. ఎవరి లబ్ధికోసం ఈ ప్రయత్నమని వారు నిలదీశారు. వైఎస్‌ కుటుంబానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ మరణించాక ఆ మహానేత పేరును ఛార్జిషిట్‌లో చేర్చిన పార్టీకి కొమ్ముకాయడమేంటని ప్రశ్నిచారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే సంజీవయ్య, నెల్లూరు మేయర్‌ స్రవంతి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పాలనలో సామాజిక సాధికారత కోసం చేసిన విప్లవాత్మక మార్పులను వివరించారు.  

కుటుంబాల్ని చీల్చగల సమర్థుడు చంద్రబాబు 
తాను గద్దెనెక్కడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగట్టగల నాయకుడు చంద్రబాబని... కుటుంబాల్ని సైతం ఆయన విడగొట్టి సొంత అన్నపై చెల్లెల్ని ఉసిగొల్పే నీచసంస్కృతి ఆయనదని వారు పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం నిరంతరం తపిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దింపడానికి కాంగ్రెస్, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారనీ... అందులో భాగస్వామి కావడం సరికాదని షర్మిలకు వారు హితవుపలికారు. 

అభినవ అంబేడ్కర్‌ వైఎస్‌ జగన్‌  
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని విజయవాడ నడిరోడ్డున సీఎం జగన్‌  నెలకొల్పారని, అదే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కేవలం హడావుడి చేసి మోసగించారని విమర్శించారు. స్వాతం్రత్యానంతరం ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, వారెవ్వరి హయాంలో అమలు కాని సామాజిక సాధికారత జగన్‌ మాత్రమే చేసి చూపించారన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించేందుకు రూ. 45 వేల కోట్లు, వివిధ పథకాల రూపంలో పేదల బ్యాంకు ఖాతాల్లోకి  రూ. 2.34 లక్షల కోట్లు జమచేశారని తెలిపారు. 

ఎమ్మెల్యే భావోద్వేగం 
నాడు ఆలయాల్లోకి ప్రవేశం లేని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను సీఎం వైఎస్‌ జగన్‌ ఏకంగా టీటీడీ బోర్డు సభ్యునిగా చేశారని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానంటే.. సీఎం జగన్‌ బీసీలు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని అన్నింటా ప్రాధాన్యత కల్పించారని  తెలిపారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు ఎక్కడ? ప్రతి దాంట్లో బీసీలకు సింహభాగం ఉండాలని  50శాతం హక్కులు కల్పించిన  సీఎం జగన్‌ ఎక్కడ అని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఈ తరానికి సీఎం వైఎస్‌ జగనే మహనీయుడుని, ఎంతమంది ఏకమైనా వైఎస్‌ జగన్‌ కాలిగోటిని కూడా కదపలేరని హెచ్చరించారు.  

ఐక్యంగా పనిచేయండి 
సూళ్లూరుపేటకు కిలివేటి సంజీవయ్యే అభ్యర్థి 
వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి 

సాక్షి, తిరుపతి: పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి మెలసి పనిచేయాలని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. నాయుడుపేటలో ఆదివారం ని­ర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ సూ­ళ్లూ­రుపేట అభ్యర్థి విషయంలో రకరకాలుగా ప్రచారం సాగుతోందని, ప్రస్తుత ఎమ్మెల్యే కిలివేటి సంజీవ­య్యే ఇక్కడి అభ్యర్థనీ ఆయన స్పష్టం చే­శారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తనకు చెప్పారన్నారు. క్రమశిక్షణరాహిత్యంతో ప్రవర్తిస్తే ఎంతటి వారినై­నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సూ­ళ్లూరుపేటకు చెందిన కట్టా సుధాకర్‌రెడ్డి, శ్రీమంతురెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జనార్దన్‌­రెడ్డి, శేఖర్‌రెడ్డి, రిఫీలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వారిచ్చిన సమాధా­నం సంతృప్తికరంగా లేదన్నారు. మార్పులున్న స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తారని, అన్ని స్థానాల్లో మార్పులు ఉండవని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement