‘వెన్నుపోటు’పై సమరశంఖం | YSRCP to protest against Chandrababu two years of rule: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటు’పై సమరశంఖం

Jun 9 2026 4:53 AM | Updated on Jun 9 2026 5:01 AM

YSRCP to protest against Chandrababu two years of rule: Andhra Pradesh

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పూజిత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలు

పలుచోట్ల నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన 

ర్యాలీలు, సమావేశాలు, సదస్సులతో హోరెత్తిన రాష్ట్రం 

ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వీడియోల ప్రదర్శన 

పెద్దఎత్తున తరలివచ్చి నిరసనల్ని విజయవంతం చేసిన ప్రజలు

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ఈ రెండేళ్లలో ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైనంపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యాచరణలో రెండో ఘట్టం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి నిరసనల్ని విజయవంతం చేశారు. పలుచోట్ల అరాచక పాలనపై ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడంతోపాటు వీడియోలు కూడా ప్రదర్శించారు.  

ఉత్తరాంధ్రలో ఉప్పెనలా 
చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై విజయనగరంలోని వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద నల్ల బెలూన్లతో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు నిరసన తెలిపారు. టౌన్‌హాల్‌ మీటింగ్‌లో టీడీపీ కూటమి తీరు­ను ఎండగట్టారు. సీఎం చంద్రబాబు ప్రభు­త్వం ఏర్పడినప్పటి నుంచి అవినీతి, అక్రమాలే చేస్తోందని మండిపడ్డారు. పార్వతీపురం, గరివిడి, నెల్లిమర్లలో పెద్దఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా రాజాంలో ర్యాలీ, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు విజయవంతమయ్యాయి.

కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన నమ్మశక్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి, రెండేళ్ల పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేశారని నేతలు మండిపడ్డారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, సంక్షేమ పథకాల నిలిపివేతతో పేదలు పడుతున్న ఇబ్బందులపై ఈ సదస్సుల్లో సుదీర్ఘంగా చర్చించారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, అనకాపల్లి, మాడుగుల, పాయకరావుపేట నియోజకవర్గాల్లో సదస్సులు విజయవంతమయ్యాయి. పెద్దఎత్తున మహిళలు, యువత, సాధారణ ప్రజలు పాల్గొని నిరసన తెలిపారు. చోడవరంలో వెన్నుపోటుకు రెండేళ్లుపై ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. పలాస, రణస్థలం, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.  

నల్లబెలూన్లతో నిరసనలు.. టౌన్‌హాల్‌ సదస్సులు 
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, గోపాలపురం, మండపేట, కొవ్వూరు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బొమ్మూరు,  ద్వారకాతిరుమల, చాగల్లులోనూ చేపట్టిన ఈ కార్యక్రమాల్లో చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన హత్యలు, అరాచకాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు.

పశి్చమ గోదావరి జిల్లా తణుకులో వ్యాపార, వర్తక సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ అన్యాయాలను స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఆచంట నియోజకవర్గంలో టౌన్‌హాల్‌ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా నూజివీడు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి నల్లబెలూన్లు వదిలి నిరసన తెలిపారు. ఎనీ్టఆర్‌ జిల్లా తిరువూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి నల్లబెలూన్లు వదిలి నిరసన తెలిపారు.

మైలవరం నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. జగ్గయ్యపేటలో ఆర్టీసీ డిపో వద్ద ఉన్న ఎలక్ట్రికల్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది. రెండేళ్ల పాలన వైఫల్యాలను, వెన్నుపోటును నిరసిస్తూ నాయకులంతా నల్ల బెలూన్లను గాలిలో వదిలారు. నందిగామ పార్టీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. బాపట్లలోని చీరాల–కారంచేడు రోడ్‌ గేట్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని నేతలు మండిపడ్డారు.

పల్నాడు జిల్లా అచ్చంపేటలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా టౌన్‌హాల్‌ సదస్సు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సెమినార్‌ నిర్వహించారు. ఒంగోలు, కొండపి, కందుకూరు, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. నరుకూరు సెంటరు నుంచి కల్యాణ మండపం వరకు నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు రూరల్‌ చింతారెడ్డిపాళెంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, మహిళలు నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలిపారు. గూడూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కూటమి పాలనపై వెన్నుపోటుకు రెండేళ్ళ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.   

రాయలసీమలో నిరసనల వెల్లువ 
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాల్లో భాగంగా వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేటలో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నల్లబెలూన్లు ఎగురవేశారు. పలుచోట్ల నల్ల కండువాలతో హాజరై సదస్సులు నిర్వహించారు. ప్రొద్దుటూరులో కూట­మి ప్రభుత్వ హామీల విఫలంపై ఫొటో ఎగ్జిబిషన్‌ ప్ర­దర్శించారు. పులివెందులలో నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు­లో నల్లబెలూన్లు ఎగురవేశారు. చంద్రబాబు ప్రభు­త్వ అరాచకాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రజలంతా తిలకించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నల్లబెలూన్లు ఎగురవేశారు.

చంద్రబాబు రెండేళ్ల వె­న్నుపో­టు పాలనకు నిరసనగా అనంతపురం జిల్లా గార్లది­న్నె మండలం కల్లూరులో వైఎస్సార్‌సీపీ నియో­జకవర్గస్థాయి సమావేశం జరిపారు. గుంతకల్లులో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. నల్లబెలూన్లు ఎగురవేసి ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. 

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హామీలు, మోసాలపై చర్చించారు. కర్నూలు జిల్లా ఆలూరులో చంద్రబాబు మోసాలపై ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు­లో చంద్రబాబు అబద్ధపు హామీలను నిరసిస్తూ నల్ల బెలూన్లు వదిలి నిరసన తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement