ఎల్లో మీడియాపై పరువు నష్టం దావా వేస్తా: ఎంపీ వేమిరెడ్డి

YSRCP MP Vemireddy Prabhakar Reddy Fires On Yellow Media - Sakshi

సాక్షి, నెల్లూరు: రేడియంట్‌ డెవలపర్స్‌కు సంబంధించి ఎలాంటి కుంభకోణం జరగలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అది రెండు ప్రైవేటు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం అని, రేడియంట్‌ సంస్థతో తనకు 30 ఏళ్ల నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మా ఒప్పందంతో ప్రభుత్వానికి సంబంధం లేదని వేమిరెడ్డి స్పష్టం చేశారు. ఎల్లో మీడియా మమ్మల్ని టార్గెట్‌ చేసి దుష్ఫ్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

‘‘ప్రభుత్వ పరంగా సాయం తీసుకుని ఉంటే ఎప్పుడో పని పూర్తయ్యేది.. వైఎస్సార్‌సీపీలో ఉంటే వ్యాపారం చేయకూడదా?. అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందనే విషయం మరవకూడదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మమ్మల్ని టార్గెట్‌ చేశాయి. ఎల్లో పత్రికలపై పరువు నష్టం దావా వేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.
చదవండి: తెలంగాణలో ఒకలా.! ఏపీలో మరోలా.! ఎందుకలా..?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top