సాక్షి, కోనసీమ జిల్లా: మాజీ మంత్రి, రాజోలు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. ఆయాన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్టంట్ వేసిన వైద్యులు.. గొల్లపల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రాజోలులో పార్టీ కార్యక్రమాలకు వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన అమలాపురం కిమ్స్‌కు తరలించి ఆయనకు వైద్యం అందించారు.


