రంగస్థల అవార్డుల నుంచి ‘వైఎస్‌ఆర్‌’ పేరు తొలగింపు | YSR Name Removed from Rangasthala Awards: andhra pradesh | Sakshi
Sakshi News home page

రంగస్థల అవార్డుల నుంచి ‘వైఎస్‌ఆర్‌’ పేరు తొలగింపు

Sep 21 2026 6:15 AM | Updated on Sep 21 2026 6:15 AM

YSR Name Removed from Rangasthala Awards: andhra pradesh

నగదు పురస్కారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.లక్షకు తగ్గింపు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే నంది అవార్డుల్లో.. రంగస్థల కళాకారులకు ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రంగస్థల పురస్కారం’పేరిట ఇస్తున్న అవార్డుల నుంచి ‘వైఎస్‌ఆర్‌’పేరును తొలగిస్తూ చంద్రబాబు సర్కారు ఆదివారం ఉత్తర్వులిచ్చింది. అలాగే, ఈ పురస్కారం కింద ఇస్తున్న నగదు పురస్కార మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.లక్ష రూపాయలకు తగ్గించేసింది. ఈ మేరకు ఏపీ స్టేట్‌ నంది థియేటర్‌ అవార్డుల నిబంధనలను సవరించింది.

 కాగా, కందుకూరి విశిష్ట పురస్కారాలను జిల్లా నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 84 మందికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కారం ఇవ్వనుంది. 2025 సంవత్సరానికి గాను నంది నాటక అవార్డులకుగాను తెలుగులో పద్య, సాంఘిక, బాలల నాటికలకు సంబంధించి అక్టోబర్‌ 20లోగా దరఖాస్తులను www.apsftvtdc.in  ద్వారా దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఏపీ చలనచిత్ర టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ ఎండీ విశ్వనాథన్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement