విశాల్ గున్ని, కాంతిరాణా టాటాకు పోస్టింగ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న విశాల్ గున్నిని ట్రైనింగ్ విభాగం డీఐజీగా నియమిస్తూ, అప్పా డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు. అలాగే కాంతి రాణా టాటాకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు.
మరిన్ని బదిలీలు ఇలా..
⇒ ఎస్పీఎఫ్ డీజీగా పనిచేస్తున్న సి.ఎం. త్రివిక్రమ్ వర్మను ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్/ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు.
⇒ ఏసీబీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఆర్ జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా బదిలీ చేశారు.
⇒ ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న బి. రాజకుమారిని రైల్వేస్ ఐజీగా నియమించడంతో పాటు, సీఐడీ మహిళా భద్రత విభాగం ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
⇒ గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న బాబూజీ అట్టాడను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేస్తూ, ప్రస్తుత గ్రేహౌండ్స్ డీఐజీ బాధ్యతలను కూడా అదనంగా కొనసాగించాలని పేర్కొన్నారు.
⇒ పోలవరం ఓఎస్‌డీగా పనిచేస్తున్న పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం జిల్లా ఎస్పీగా నియమించారు.
⇒ సీఎంఎస్‌జీ ఎస్పీగా పని చేస్తున్న జగదీశ్ అదహళ్లిని పల్నాడు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
⇒ సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తిని పోలవరం జిల్లా ఎస్పీగా నియమించారు.


