Asani Cyclone Effect: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసని తుఫాన్ వల్ల సంభవిస్తున్న ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13కు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’