ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ స్థానం సుస్థిరం..

Ys Rajasekhara Reddy Birthday Special Story Srikakulam - Sakshi

నేడు వైఎస్సార్‌ జయంతి 

సాక్షి, శ్రీకాకుళం: ఏళ్లు గడిచిపోతున్నాయి.. ఆ అభిమానం చెక్కు చెదరలేదు. క్యాలెండర్లు మారిపోతున్నాయి. ఆయనపై పెంచుకున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. సంక్షేమం అంటే గుర్తుకువచ్చేది ఆయనే. అభివృద్ధి అంటే జ్ఞాప కం వచ్చేది ఆయన పేరే. వైఎస్సార్‌ మూడే అక్షరాలు. కానీ అభిమానుల పాలిట ఇవి మంత్రాక్షరాలు. వరుస సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డిని ఆ పథకాలతో చిరంజీవిగా మార్చేశారు. అంతటి గొప్ప నేత జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 

జిల్లాలో రాజన్న జ్ఞాపకాలు  
శ్రీకాకుళానికి ఓ పెద్దాస్పత్రి ఉండాల్సిందేనని భావించి ప్రజలు కోరకుండానే ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. మంజూరు ప్రకటన చేయడమే కాకుండా రూ. 119 కోట్లు కేటాయించారు. 300 పడకల జిల్లా కేంద్ర ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశా రు. ఏటా జిల్లా నుంచి వందల మంది వైద్యులను తయారు చేసే కళాశాలను జిల్లాలో పెట్టారు. శంకుస్థాపన, ప్రారంభో త్సవం రెండూ ఆయన చేతుల మీదుగానే జరిగాయి.  
జిల్లాకు యూనివర్సిటీని అందించిన ఘనత వైఎస్సార్‌దే. ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడీ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతోంది. 

రైతు పక్షపాతిగా.. 
రైతులను ఆదుకున్న ఏౖకైక నేత వైఎస్సారే. 2.50 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశా రు. అప్పటికే రుణాలు చెల్లించేసిన వారికి రూ. 5వేలు చొప్పున ప్రోత్సాహం అందించారు. అంతటితో ఆగకుండా ప్రతి చుక్కనీటిని అందిపుచ్చుకుని, రైతుకు అందించాలని అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 2005మే నెలలో వంశధార స్టేజ్‌ 2, ఫేజ్‌2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55లక్షల ఎకరాల కు సాగునీరందించేందుకు తలపెట్టారు. ఇప్పు డా కార్యక్రమంలోనే భాగంగానే నేరడి బ్యారేజీ నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19టీఎంసీల నీటి నిల్వకోసం రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. తోటపల్లి ఫేజ్‌ 2 ప నుల ఘనత ఆయనకే దక్కుతుంది.

సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కా రం కోసం రూ. 123.25కోట్లతో ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తయితే 2.55 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని   వైఎస్సార్‌ అప్పట్లో పనులకు శ్రీకారం చుట్టారు. 12500ఎకరాల సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్‌ 1పనులను రూ. 57.87కోట్లతో చేపట్టారు. నాగావళి, వంశధార నదుల వరద ఉద్ధృతి నుంచి పంట పొలాలను, ఆవాసాలను రక్షించేందుకు రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. సీతంపేట ఏజెన్సీలో 14 వేల ఎకరాల్లో 5వేల మందికి గిరిజన రైతు లకు పట్టాలు ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లక్షా 80వేల 817ఇళ్లు మంజూరు చేసి అందులో లక్షా 63వేల 140ఇళ్లను పూర్తిచేశారు.  

ఆరోగ్య ప్రదాతగా  
నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలన్న సంకల్పంతో 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ తో వేలాది మందికి జీవం పోశారు. 938 రకాల వ్యాధులకు కార్పొరేట్‌ వైద్యం అందించారు.  ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో ఆస్పత్రికి చేర్పిస్తే ప్రాణం నిలబెట్టవచ్చని 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు. గ్రామీణులకు ప్రతి నెలా వైద్యం అందించడానికి 104 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లతో పేదలకు కార్పొరేట్‌ చదువులను చేరువ చేశారు.

వైఎస్సార్‌ బాటలో సీఎం జగన్‌  
తండ్రి బాటలోనే కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారు. రాష్ట్రానికి వైఎస్సార్‌ అందించిన సేవలను స్మరించుంటూ ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుతున్నారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో  ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నడుం బిగించారు. నేరడి బ్యారేజీ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద వేల కోట్ల రూపాయలను రైతులకు అందించారు. రైతు దినోత్సవం సందర్భంగా జిల్లాలో రైతులకు సంబంధించిన అగ్రీ ల్యాబ్, ఆక్వా ల్యాబొరేటరీ, రైతు భరోసా కేంద్రాలు తదితర ప్రారంభిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top