
సాక్షి, తాడేపల్లి: నేడు గుర్రం జాషువా వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. గుర్రం జాషువాకు నివాళులు అర్పించారు. తాజాగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘కవిత్వం ద్వారా సామాజిక విప్లవానికి బీజం వేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. అన్యాయానికి వ్యతిరేకంగా, దళితుల హక్కుల కోసం ధైర్యంగా నిలబడి రచనలు చేసిన గొప్ప వ్యక్తి ఆయన’ అని నివాళులు అర్పించారు.

కవిత్వం ద్వారా సామాజిక విప్లవానికి బీజం వేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. అన్యాయానికి వ్యతిరేకంగా, దళితుల హక్కుల కోసం ధైర్యంగా నిలబడి రచనలు చేసిన గొప్ప వ్యక్తి ఆయన. నేడు గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/UVCz3YuaRV
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2025