
సాక్షి, తాడేపల్లి: నేడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళి అర్పించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్. స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘసంస్కర్తగా రాజకీయ నాయకుడిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా… pic.twitter.com/9GjikxISRJ
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 6, 2025