చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు | YS Jagan Greets CM Chandrababu On Birthday | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

Apr 20 2026 8:25 AM | Updated on Apr 20 2026 8:41 AM

YS Jagan Greets CM Chandrababu On Birthday

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

చంద్రబాబుగారూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన దీర్ఘాయుష్షు మీకు కలగాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. 

చంద్రబాబు నాయుడికిది 76వ పుట్టినరోజు. ఆయన 1950 ఏప్రిల్ 20న తిరుపతి జిల్లా నరవరిపల్లిలో జన్మించారు. తొలిసారి 1978లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 1980లలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీలో చేరారు. 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దించిన చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చున్నారు. 1995–2004, 2014–2019, 2024–ప్రస్తుతం.. రెండుసార్లు ఉమ్మడి ఏపీకి, రెండుసార్లు విభజిత ఏపీకి.. మొత్తం నాలుగుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement