సాక్షి, తాడేపల్లి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు.
Warm wishes to all the brothers and sisters of Telangana on the auspicious occasion of Telangana Formation Day!
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2026


