కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | Ys Jagan Expresses Shock Over Kunavaram Incident | Sakshi
Sakshi News home page

కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Mar 20 2026 4:58 PM | Updated on Mar 20 2026 6:08 PM

Ys Jagan Expresses Shock Over Kunavaram Incident

సాక్షి, తాడేపల్లి: కూనవరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరిలో పడి ఐదుగురు ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు మృతి చెందటం బాధాకరమన్న వైఎస్‌ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన విషాదకరమని.. ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కుక్కునూరు మండలం వేలేరు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. గోక తేజ-ఉయ్యూరు (ఏపీ), నవదీప్-ఉయ్యూరు (ఏపీ), పాశం సతీష్ కుమార్, మదనపల్లి (ఏపీ), చారు గుండ్ల శ్రీకర్ భద్రాచలం (తెలంగాణ), పొడిచేటి అభిరామ్  భద్రాచలం (తెలంగాణ) గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement