పలమనేరు: రోడ్డుపై మదపుటేనుగు హల్‌చల్‌

Wild Tusker Blocks Traffic On NH In Palamaner - Sakshi

సాక్షి, పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు– గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిపై ముసలిమొడుగు వద్ద మదపుటేనుగు శుక్రవారం హల్‌చల్‌ చేసింది. సమీపంలోని కౌండిన్య అభయారణ్యం నుంచి రోడ్డుపైకి వచ్చిన ఏనుగు రోడ్డును దాటి తూర్పు వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్‌ ఫెన్సింగ్‌ కారణంగా వెళ్లలేక రోడ్డుపైనే 2 గంటలపాటు తిరుగుతూ ఉండిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఏనుగు తిరుగుతుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. చాలాసేపు అక్కడే ఉన్న మదపుటేనుగు తిరిగి కృష్ణాపురం అటవీ ప్రాంతం వైపుగా వెళ్లిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top