వేడెక్కుతున్న మన్యం | Weather Report: Temperature Rises To 37 Degrees In Paderu | Sakshi
Sakshi News home page

వేడెక్కుతున్న మన్యం

Apr 30 2022 11:37 PM | Updated on Apr 30 2022 11:37 PM

Weather Report: Temperature Rises To 37 Degrees In Paderu - Sakshi

సాక్షి,పాడేరు : చల్లని ప్రాంతమైన జిల్లాలో ఎండ తీవ్రత నెలకొంది. శుక్రవారం సూర్యోదయం తరువాత  నుంచి ఎండ చుర్రుమంది. పాడేరులో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఎండ తీవ్రత నెలకొనడంతో అన్ని వర్గాల ప్రజలు ఉష్ణ తాపంతో ఇబ్బందులు పడుతున్నారు.

వ్యవసాయ, ఉపాధిహామీ పనులకు వెళ్లే గిరిజనులతో పాటు పశువుల కాపరులు కూడా అధిక ఎండతో అవస్థలు పడ్డారు. పాడేరు వారపుసంతలో కూడా ఎండతో గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వరకు వేడిమి వాతావరణం నెలకొంది. మండల కేంద్రాలు ప్రధాన జంక్షన్లు, గ్రామాల్లో శీతల పానీయాల అమ్మకాలు జోరందుకున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement