Miss South India 2022: మిస్‌ సౌత్‌ ఇండియాగా వైజాగ్‌ అమ్మాయి

Vizag Girl Wins Miss South India 2022 - Sakshi

ఏయూక్యాంపస్‌(విశాఖపట్నం): మిస్‌ సౌత్‌ ఇండియాగా విశాఖ అమ్మాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం విద్యార్థిని చరిష్మా కృష్ణ ఎంపికైంది. కేరళలో పెగాసస్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహించిన ఈ పోటీల్లో ఆమె కిరీటం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టి, తన ప్రతిభతో చరిష్మా విజేతగా నిలిచింది.
చదవండి: లైగర్‌ను దొంగచాటుగా కలిసిన బ్యూటీ!

ప్రముఖ మోడల్‌ భారతి బెర్రి ఆమెకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫెమీనా మిస్‌ ఇండియాకు సిద్ధమవుతోంది. చిన్నతనం అమెరికాలో గడిపిన చరిష్మా కృష్ణ భరతనాట్యం, కూచిపూడి నృత్యం తొమ్మిదేళ్లుగా నేర్చుకుంటోంది. స్విమ్మింగ్, కరాటే, గుర్రపుస్వారీ విద్యలను సైతం నేర్చుకుంది. చిన్నతనం నుంచి కళలపై ఆసక్తితో నృత్య కళాకారిణిగా, నటిగా రాణిస్తోంది. తండ్రి హరికృష్ణ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి గృహిణి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top