YS Viveka Case: SC Directs CBI Change Investigation Officer Immediately - Sakshi
Sakshi News home page

వివేకా కేసు దర్యాప్తు అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం

Mar 27 2023 12:14 PM | Updated on Mar 27 2023 3:37 PM

Viveka Case: SC Directs CBI Change Investigation Officer Immediately - Sakshi

వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం..  

సాక్షి, ఢిల్లీ:  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ M.R.షా కేసు విచారణలో సిబిఐ చేస్తున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న అధికారిని వెంటనే మార్చాలని సిబిఐకి సూచించిన జస్టిస్ ఎం అర్ షా, తదుపరి నిర్ణయానికి సంబంధించి సిబిఐ డైరెక్టర్ తన అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేయాలని సూచించారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 10కు వాయిదా వేశారు. 

‘‘స్టేటస్‌ రిపోర్ట్‌లో ఎలాంటి పురోగతి లేదు. ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారు. చెప్పిందే చెప్తున్నారు.  కానీ, దోషుల్ని పట్టుకునేందుకు ఈ కారణాలు సరిపోవు. వివేకా హత్యలో విస్తృత కుట్ర ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో బెయిలిచ్చే ప్రసక్తి కూడా లేదు’’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా పేర్కొన్నారు.  

‘‘ఇది(సీబీఐ తీరు) సరైన పద్ధతి కాదు. కేసుకు ఒక ముగింపంటూ ఉండాలి.  2021 నుంచి కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి?.  ప్రస్తుత అధికారి తీరును చూస్తే ఈ కేసును ముగించే స్థితిలో లేనట్లుంది అంటూ జస్టిస్‌ ఎంఆర్‌ షా అసహనం వ్యక్తం చేశారు. 

దర్యాప్తు ఇలా సాగదీయడం సరి కాదన్న న్యాయమూర్తి.. వివేకా హత్యలో విస్తృత కుట్రను బయటకు తీయాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇదీ చదవండి: వివేకా హత్య కేసులో ఈ అంశాలు ఎందుకు పరిశీలించలేదు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement