గ్లోబల్‌ వార్మింగ్‌కు చెక్‌ | Visakhapatnam students conduct research to reduce global warming | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ వార్మింగ్‌కు చెక్‌

Dec 29 2024 5:53 AM | Updated on Dec 29 2024 5:53 AM

Visakhapatnam students conduct research to reduce global warming

గోబల్‌వార్మింగ్‌ను తగ్గించేలా పరిశోధన చేసిన విశాఖ విద్యార్థ్ధులు 

‘బ్లూ కార్బన్‌ ఎకో సిస్టం పయనీరింగ్‌’ పరిశోధనకు దేశంలో తొలి స్థానం 

ఫెలోషిప్‌కు 10 రోజుల పాటు యూఎస్‌కు వెళ్లనున్న విద్యార్థులు 

సీతంపేట: విద్యార్థ్ధుల్లో నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు ఆవిష్కరిస్తారని మరొక సారి రుజువైంది. విశాఖలోని డాక్టర్‌ లంకపల్లి బుల్ల­య్య కళాశాల లైఫ్‌ సైన్స్‌ విద్యార్ధుల పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. డిగ్రీ స్థాయిలోనే అంతర్జాతీయ ప్రతిభ చాటారు బుల్లయ్య కళాశాల విద్యార్ధులు. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తు­న్న గ్లోబల్‌వార్మింగ్‌కు విద్యార్ధులు తమ పరిశోధన ద్వారా చక్కటి పరిష్కారం చూపారు.

వాతావరణం వేడెక్కడానికి కారణం అవుతున్న కార్చన్‌ డయాక్సైడ్‌ శాతాన్ని వాతావరణంలో తగ్గించేలా తమ పరిశోధనతో పరిష్కారం చూపారు. కళాశాలలో బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు హర్షిత, తేజాంబిక్, కార్తికేయ, అశ్విని తమ పరిశోధనల్లో విజయం సాధించారు. విశాఖ సముద్ర తీరంలో సముద్రపు గడ్డి పచ్చిక భూములను పునరుద్ధించే ‘బ్లూ కార్బన్‌ ఎకో సిస్టం పయనీరింగ్‌’అను అంశంపై పరిశోధన చేసారు. 

స్టూడెంట్‌ సొసైటీ ఫర్‌ క్‌లైమేట్‌ ఛేంజ్‌ అవేర్‌నెస్‌ ( ఎస్‌ఎస్‌సీసీఏ) , సీడ్స్‌ ఆఫ్‌ పీస్‌ ( యూఎస్‌ఏ) సంస్థలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీలో 33 టీమ్‌­లు పాల్గొనగా, బుల్లయ్య కళాశాల విద్యార్థ్ధులు చేసిన పరిశోధనలకు క్‌లైమేట్‌ ట్యాంక్‌ యాక్సిలరేటర్‌ పోటీ­లో ప్రథమ స్థానంలో నిలిచి వెయ్యి డాలర్లు బహుమతిగా గెలు­పొందారు. ప్రాజెక్టు తదుపరి అధ్యయనాల కోసం విద్యార్థులను 2025 ఫిభ్రవరిలో10 రోజుల ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌కు యూఎస్‌ఏ వెళ్లనున్నారు. 

పరిశోధన ఎలా సాగిందంటే.. 
హైదరాబాదుకు చెందిన ఎన్జీవో సంస్థ ఎస్‌ఎస్‌సీసీఏ, నూయార్క్‌ కు చెందిన సీడ్స్‌ పీస్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించి ఆరు ఆంశాలపై పరిశోధనలకు విద్యార్థ్ధులకు అవకాశం కల్పించారు. బుల్లయ్య విద్యార్ధులు గ్లోబల్‌వార్మింగ్‌ తగ్గించడానికి క్లైమేట్‌కి సంబంధించిన టాపిక్‌ ఎంపిక చేసుకున్నారు. ఈ విధంగా దేశంలో వివిధ కళాశాలల నుంచి 33 టీమ్స్‌ ఈ పోటీలో పాల్గొన్నాయి. 

ఈపోటీలో బుల్లయ్య కళాశాల నుంచి 3 టీమ్స్‌ పాల్గొనగా, ఒక టీమ్‌లో డిగ్రీ (బయోటెక్నాలజి) ఫైనలియర్‌ చదువుతున్న నలుగురు విద్యార్ధులు , వారికి గైడెన్స్‌గా ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ ఉన్నారు. మొదటి అంచెలో ఎంపిక చేసుకున్న టాపిక్‌పై పరిశోధన ఎలా చేలాయన్న విషయంపై ఓరియెంటేషన్‌ జరిగింది. రెండవ ఫేజ్‌లో ఎంపిక చేసిన టాపిక్‌పై డిస్క్రిప్టివ్ ఐడియాను సిద్ధం చేసారు. పరిశోధన నిమిత్తం సీడ్స్‌ సంస్థ 200 డాలర్లు అందజేసింది. మొదటి రెండు ఫేజ్‌లు పూర్తి అయిన తర్వాత పరిశోధనకు వాస్తవ రూపం కల్పించారు. 

తాము ఎంపిక చేసుకున్న గ్లోబల్‌వార్మింగ్‌ తగ్గించడానికి విద్యార్ధులు ఎన్నో పరిశోధన పత్రాలు చదవి ఒక ఐడియాకు వచ్చారు. విశాఖ సము­ద్ర­తీరంలో అంతరించిపోయిన 2 గడ్డి జాతిమొక్కలను మరల ఇక్కడ పునరుద్ధించి తద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ శాతాన్ని తగ్గించేలా నమూనాలు తయారు చేసారు. ఒరిస్సాలోని చిలికా సరస్సు నుంచి ‘హలోఫిలా ఓవాలిస్, హలోడ్యూల్‌ ఫీనిఫోలియా’అను రెండు గడ్డి జాతి మొక్కలను తెచ్చారు. 

సాధా­రణ మొక్కల కంటే 33 శాతం అధికంగా వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ పీల్చుకోవడం వీటి ప్రత్యేకత. తెచి్చన గడ్డి మొక్కలను కళాశాల ల్యాబ్‌లలో అవి పెరిగేలా సముద్ర వాతావరణం కల్పించారు. దీని కోసం చెక్కతో తయారు చేసిన ట్రేలలో కొబ్బరిపీచు, సముద్రపు నీరు,ఇసుక, గడ్డి ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. స్కూబా డ్రైవర్స్‌ సాయంతో తీరంలో మంగమారిపేట బీచ్‌లో 8 మీటర్ల లోతులో నాటారు.  

వెయ్యి డాలర్లు బహుమతి  
డిసెంబరు 12న హైదరాదులో జరిగిన సమావేశంలో విద్యార్ధులు రూపొందించిన వర్కింగ్‌ మోడల్‌ను యూఎస్‌ కాన్సులేట్‌ నుంచి వచి్చన జడ్జిలు పరిశీలించారు.ప్రాజెక్టు పని చేసే తీరును విద్యార్ధులు వారికి ప్రెజెంట్‌ చేసారు. ఈపోటీలో పాల్గొన్న 33 టీమ్‌లలో తుది దశకు 8 టీమ్‌లు చేరుకోగా అందులో బుల్లయ్య కళాశాల టీమ్‌ మొదటి స్థానంలో నిలిచి వెయ్యి డాలర్లు బహుమతి గెలుచుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement