దసరా ఉత్సవాల దృష్ట్యా దుర్గగుడి ఆలయ కమిటీ నిర్ణయాలు

Vijayawada: Durgamma Temple Committee Makes Arrangements For Dasara - Sakshi

సాక్షి,విజయవాడ: దసరా ఉత్సవాలు విజయవాడలో ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి ఆలయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా టైం స్లాట్‌ ప్రకారమే దర్శనాలు ఉంటాయని తెలిపింది. రోజుకు 10 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పేర్కొంది. భక్తుల ఉచిత దర్శనాల కోసం 2 క్యూలైన్లు ఏర్పాటు చేయగా, ఆన్‌లైన్‌లో టైం స్లాట్‌ ప్రకారం రూ.100, రూ.300 దర్శన టికెట్లు అందుబాటులో ఉంచునుంది. కాగా ఆన్‌లైన్‌ టికెట్ల కోసం http://aptemples.ap.gov.in వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశారు.

చదవండి: ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top