
న్యూఢిల్లీ: రాజ్యసభ వేదికగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. కంప్యూటర్, సెల్‌ఫోన్‌ను తానే కనుగొన్నానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారన్నారని.. అదే నిజమైతే వాటి పేటెంట్ హక్కుల కోసం కేంద్రం ప్రయత్నించాలని కోరారు.
చంద్రయాన్ విజయంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. అన్నీ నేనే కనిపెట్టానంటూ చెప్పుకుంటున్న బాబుకు ఓ రేంజ్‌లో చురకలంటించారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను గురువు అంటారు. అంతరిక్ష పరిశోధనలకు నాంది నేనే పలికాను అంటారు. చంద్రబాబు కనిపెట్టిన వస్తువులకు పేటెంట్ తీసుకుంటే భారత్‌కు కోట్లలో ఆదాయం గ్యారంటీ’. అంటూ బాబుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.
చదవండి: CBN Arrest: ఇంత అతి ఏంట్రా బాబూ!