
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ భూమిని ఆక్రమించి విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనాలను నిర్మించడంతోపాటు వాస్తవాలను దాచిపెట్టి అక్రమ రీతిలో ఏఐసీటీఈ నుంచి అనుమతులు సంపాదించిందని, తద్వారా ఏఐసీటీఈ నియమ నిబంధనలను ఉల్లంఘించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిజాల నిగ్గు తేల్చేందుకు తక్షణమే విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్దేకు శుక్రవారం లేఖ రాశారు.