కరోనాతో భార్య మృతి, మనస్తాపంతో భర్త ఆత్మహత్య! | Vijayanagaram Man Kills Self After Wife Dies Of Covid 19 | Sakshi
Sakshi News home page

కరోనాతో భార్య మృతి, మనస్తాపంతో భర్త ఆత్మహత్య!

Dec 19 2021 7:59 AM | Updated on Dec 19 2021 9:41 AM

Vijayanagaram Man Kills Self After Wife Dies Of Covid 19 - Sakshi

ఉరివేసుకున్న యర్రంశెట్టి సన్యాసిరావు( ఇన్‌సెట్‌) సన్యాసిరావు (ఫైల్‌)

అక్కిరెడ్డిపాలెం(గాజువాక): భార్య కరోనాతో మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవీఎంసీ 69వ వార్డు హరిజనజగ్గయ్యపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాజువాక ఎస్‌ఐ సూర్యప్రకాశరావు తెలిపిన వివరాలివీ.. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి సన్యాసిరావు(50) హరిజనజగ్గయ్యపాలెంలో ఇంట్లోనే టైలరింగ్‌ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. అతని భార్య చిన్నమ్మలు ఏప్రిల్‌లో కరోనాతో మృతి చెందింది.

అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంలో ఉన్నాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటుపడ్డాడని గ్రామస్తులు తెలిపారు. శనివారం మధ్యాహ్న సమయంలో హోటల్‌ నుంచి భోజనం తెచ్చుకున్నాడు. దాన్ని విప్పకుండా రోడ్డుపై పడేసి.. కొద్దిసేపటి తర్వాత ఇంటి తలుపుల లోపలి గడియ పెట్టుకున్నాడు. ఇంటి యజమానికి అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సన్యాసిరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు, కుమార్తెకు వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు అవివాహితుడని పోలీసులు తెలిపారు.  

చదవండి: డెల్టా, ఒమిక్రాన్‌ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్‌ ప్రత్యేకత అదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement