ఫిబ్రవరికల్లా రథం నిర్మాణం పూర్తి: వెలంపల్లి శ్రీనివాస రావు

Vellampalli Srinivas Rao Said Antarvedi Chariot Ready Next February - Sakshi

రథంతో పాటు రథశాల మరమ్మతుకు రూ.95 లక్షలు

సాక్షి, విజయవాడ: వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అంద‌రి అభిప్రాయాల మేర‌కు.. ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను అదేశించిన్న‌ట్లు దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. సోమ‌వారం బ్రాహ్మ‌ణ వీధి దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఆ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌తో మంత్రి వెలంప‌ల్లి స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించామన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించామన్నారు. (చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం?)

ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తులుగా రూపొందిస్తున్నమని వెలంపల్లి తెలిపారు. కొత్త రథం నిర్మాణంతో పాటు.. ర‌థ‌శాల మరమ్మతుల నిమిత్తం 95 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జ‌రిగింద‌న్నారు మంత్రి వెలంపల్లి. స‌మావేశంలో దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు, ఎస్ఈ శ్రీ‌నివాస‌రావు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top