ప్రాణం ఉన్నంతవరకూ జగనన్న వెంటే..  | Vamsi Krishna Srinivas Serious On False Propaganda | Sakshi
Sakshi News home page

ప్రాణం ఉన్నంతవరకూ జగనన్న వెంటే.. 

Mar 20 2021 11:41 AM | Updated on Mar 20 2021 11:41 AM

Vamsi Krishna Srinivas Serious On False Propaganda - Sakshi

మేయర్‌ను అభినందిస్తున్న వంశీకృష్ణ

పార్టీ ఎప్పుడూ తనకు అన్యాయం చేయలేదని, ఎప్పటిలాగే పార్టీ కోసం, జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తానన్నారు.

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే తనకు అమితమైన ప్రేమ.. ప్రాణమున్నంతవరకు జగనన్న వెంటే నడుస్తానని ఆ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడూ తనకు అన్యాయం చేయలేదని, ఎప్పటిలాగే పార్టీ కోసం, జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తానన్నారు. జీవీఎంసీ మేయర్‌ పదవి దక్కలేదన్న కోపంతో పార్టీ నగర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు నమ్మవద్దని కోరారు.

ఫేక్‌ అకౌంట్‌తో వివాదాస్పద పోస్టింగ్‌లు 
కొంతమంది నా పేరుతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి వైఎస్సార్‌ సీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెడుతున్నారని, అలా చేసిన వారిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్‌ హెచ్చరించారు. పార్టీకి, నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. తల్లి వంటి పార్టీని, పెద్దల ప్రతిష్టకు భంగం కల్గించే చర్యలను పూర్తిగా ఖండిస్తున్నానని వంశీకృష్ణ పేర్కొన్నారు.
చదవండి:
నమ్మించి నట్టేట ముంచారు.. టీడీపీ ఎమ్మెల్యేపై గుస్సా 
తిరుపతి ఉప పోరు: ‘ఆ ది’శగా అరాచకాలకు కుట్ర!

Advertisement
 
Advertisement
Advertisement